RSS Meeting : అహ్మదాబాద్ వేదికగా ఆర్ఎస్ఎస్ సమావేశాలు.. హాజరుకానున్న సంఘ్ పరివార్ నేతలు

|

Jan 02, 2021 | 3:38 PM

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ మధ్య జరిగే సమన్వయ సమావేశంకు అహ్మదాబాద్ వేదికగా మారుతోంది. ఈ నెల 5 నుంచి 7 తేదీ వరకు అహ్మదాబాద్ వేదికగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమన్వయ..

RSS Meeting : అహ్మదాబాద్ వేదికగా ఆర్ఎస్ఎస్ సమావేశాలు.. హాజరుకానున్న సంఘ్ పరివార్ నేతలు
Follow us on

RSS Meeting : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ మధ్య జరిగే సమన్వయ సమావేశంకు అహ్మదాబాద్ వేదికగా మారుతోంది. ఈ నెల 5 నుంచి 7 తేదీ వరకు ఈ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమన్వయ సమావేశానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ చాలక్ మోహన్ రావ్ భాగవత్ అధ్యక్షత వహించనున్నారు.

ఈ సమావేశాల్లో ఆరెస్సెస్ సీనియర్ నేతలతో పాటు బీజేపీ తరపున జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని తెలుస్తోంది. జేపీ నడ్డాతో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో పాల్గొని, మరుసటి రోజు స్థానిక నేతలతో నడ్డా సమావేశం కానున్నారు.

ఈ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై చర్చించనున్నారు. వీటిలో రైతు ఉద్యమం, బెంగాల్, అసోం, కేరళ, తమిళనాడు ఎన్నికల గురించి చర్చ జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.