విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌..?

|

Oct 22, 2020 | 6:34 PM

ఈసారి బ్యాటింగ్‌లోనే బలహీనంగా తయారైంది. సులభమైన లక్ష్యాన్ని కూడా ఛేదించలేక మ్యాచ్‌లను ప్రత్యర్థికి సమర్పించుకుంటోంది. గత మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా.. సూపర్‌ ఓవర్‌లో మంచి హిట్టర్‌ లేని కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది...

విలియమ్సన్‌ స్థానంలో హోల్డర్‌..?
Follow us on

Jason Holder to Replace Kane Williamson..? : ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఉన్న రెండు జట్లు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఏడో స్థానంలో ఉన్న హైదరాబాద్‌, ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. అయితే కొన్ని బలహీనతలను సవరించుకునేందుకు హైదరాబాద్ జట్టు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగావిలియమ్సన్ ప్లేస్‌‌లో హోల్డర్‌ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గత సీజన్‌లో బ్యాటింగ్‌తో భయపెట్టిన హైదరాబాద్‌ జట్టు ఈసారి బ్యాటింగ్‌లోనే బలహీనంగా తయారైంది. సులభమైన లక్ష్యాన్ని కూడా ఛేదించలేక మ్యాచ్‌లను ప్రత్యర్థికి సమర్పించుకుంటోంది. గత మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడినా.. సూపర్‌ ఓవర్‌లో మంచి హిట్టర్‌ లేని కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

అయితే.. ఇప్పటికే బ్యాటింగ్‌లో కాస్త బలహీనంగా కనిపిస్తున్న హైదరాబాద్‌కు విలియమ్సన్‌ గాయం కలవరపెడుతోంది. ఈ మ్యాచ్‌లో కేన్‌ రిజర్వ్‌బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అతని స్థానంలో విండీస్‌ ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ను తీసుకోవచ్చు. అతను బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేయగలడు. బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌, నటరాజన్‌ ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.