హైదరాబాద్‌లో మొక్కజొన్నల వ్యాపారి కిడ్నాప్‌..

|

Oct 05, 2020 | 9:25 PM

హైదరాబాద్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్‌ కలకలం రేపింది. సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రీన్‌పార్క్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణంను ఓ రౌడీ షీటర్‌ అపహరించాడు.

హైదరాబాద్‌లో మొక్కజొన్నల వ్యాపారి కిడ్నాప్‌..
Follow us on

Businessman Kidnapped :హైదరాబాద్‌లో ఓ వ్యాపారి కిడ్నాప్‌ కలకలం రేపింది. సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రీన్‌పార్క్‌ కాలనీలో ఈ ఘటన జరిగింది. మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణంను ఓ రౌడీ షీటర్‌ అపహరించాడు.

మాదాపూర్‌కు చెందిన రౌడీషీటర్‌ అజీజ్‌తో తన అనుచరులతో వచ్చి వ్యాపారి నాగభూషణంను కిడ్నాప్‌ చేశాడు. 30 మంది దుండగులు ఆయన్ను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. ఈ తతంగమంతా సీసీటీవీల్లో రికార్డయ్యింది. ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారి కుటుంబ సభ్యులు సరూర్‌నగర్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ చేసిన వ్యాపారిని సిద్దిపేట వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

రంగంలోకి దిగిన పోలీసులు… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నాగభూషణంకు… రౌడీషీటర్‌కు మధ్య గతంలో ఏవైనా లావాదేవీలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు.