హన్మకొండ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. డబ్బులు కట్టేదాకా పేషేంట్‌ను చేర్చుకోని సిబ్బంది.. చికిత్స అందక మహిళ మృతి

|

Dec 25, 2020 | 5:26 PM

వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. బిల్లు కట్టలేదని ఓ పేషేంట్‌ను చేర్చుకునేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. డబ్బులు కట్టలేదని అడ్మిట్ చేసుకోకుండా అంబులెన్స్ వాహనంలోనే వదిలి వెళ్ళింది ఆసుపత్రి సిబ్బంది. సరైన సమయానికి చికిత్స అందక ఆ మహిళ ప్రాణాలను విడిచింది.

హన్మకొండ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. డబ్బులు కట్టేదాకా పేషేంట్‌ను చేర్చుకోని సిబ్బంది.. చికిత్స అందక మహిళ మృతి
Follow us on

వరంగల్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. బిల్లు కట్టలేదని ఓ పేషేంట్‌ను చేర్చుకునేందుకు ఆస్పత్రి సిబ్బంది నిరాకరించింది. డబ్బులు కట్టలేదని అడ్మిట్ చేసుకోకుండా అంబులెన్స్ వాహనంలోనే వదిలి వెళ్ళింది ఆసుపత్రి సిబ్బంది. సరైన సమయానికి చికిత్స అందక ఆ మహిళ ప్రాణాలను విడిచింది.

ప్రాణాపాయ స్థితిలో పేషెంట్‌ వస్తే ఏ డాక్టరైనా ఏం చేయాలి..? ముందు హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుని చికిత్స మొదలుపెట్టాలి. ఎందుకంటే.. ప్రతీక్షణం విలువైందే.. ఈ విషయం డాక్టర్లకు బాగా తెలుసు.. గోల్డ్ అయినా.. వరంగల్‌లోని రోహిణి ఆస్పత్రి సిబ్బంది మాత్రం అలా అనుకోలేదు.. రోగి ప్రాణాల కన్నా.. తమకు కట్టాల్సిన బిల్లే ముఖ్యమనుకున్నారు. హాస్పిటల్‌ అంబులెన్స్‌లోనే పేషెంట్‌ వచ్చినా.. గంటసేపు వెయిట్‌ చేయించారు.. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో అంబులెన్స్‌లోనే రోగి ప్రాణం వదిలింది. ఒక్కసారిగా రగిలిపోయిన ఆమె కుటుంబసభ్యులు.. ఆస్పత్రిపై దాడికి దిగారు. ఆస్పత్రి పరిసరాల్లోని పూలకుండీలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

కొమురమ్మ అనే మహిళను హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అయితే.. అడ్మిట్ చేసుకోవడానికి ముందు బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది చెప్పడంతో అవాక్కయ్యారు. డబ్బులు చెల్లించినా.. ఆ తర్వాత మెడిసిన్స్ కూడా తేవాలంటూ చెప్పారని.. పేషెంట్‌ను మాత్రం అడ్మిట్ చేసుకోలేదంటున్నారు. ఈ లోగా కొమురమ్మ చనిపోవడంతో.. దాడికి పాల్పడ్డారు. అటు పరిస్థితిని అదుపుచేయడానికి వచ్చిన పోలీసులతోనూ వాగ్వాదానికి దిగారు మృతురాలి బంధువులు. హాస్పిటల్ సిబ్బంది మాత్రం ఇందులో తమ తప్పేమీ లేదంటున్నారు.

ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతిరాలి కుటుంబసభ్యులకు సర్ధిచెప్పడంతో గొడవ శాంతించింది. ఇందుకు సంబంధించి రోహిణి ఆస్పత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.