బస్సు డ్రైవర్‌ను ఈడ్చుకెళ్లిన డీసీఎం వ్యాన్..

|

Aug 15, 2020 | 3:12 PM

ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో చోటు చేసుకుంది. డీసీఎం వెనుక తలుపు కొక్కెం ఊడిపోయి టూ వీలర్ పై వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు తగిలి కిలో మీటరు వరకు ఈడ్చుకెళ్లింది....

బస్సు డ్రైవర్‌ను ఈడ్చుకెళ్లిన డీసీఎం వ్యాన్..
Follow us on

Road Accident in Uppal : ఓ చిన్న నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. డీసీఎం డ్రైవర్ తన వాహనం వెనుక డోర్ ఉండే గొలుసును సరిగ్గా పెట్టుకోక పోవడంతో పెద్ద ప్రమాదాన్ని క్రియేట్ చేసింది. రోడ్డుపై తనదారిలో తాను వెళ్తుతున్న వ్యక్తిని యమకింకురుడిలా చైన్ కొక్కెం పటేసింది. దీంతో అతడిని ఆ డీసీఎం వ్యాన్ ఓ కిలోమీటర్ వరకు లాక్కుపోయింది. ఇంత జరుగుతున్న ఆ దారిలో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా ఇది గమనించక పోవడం విడ్డూరంగా ఉంది. ఎంతో బిజీగా ఉండే ఆ రహదారిలో ఇంత జరుగుతున్న ఎవరూ చూడలేదు.

ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో చోటు చేసుకుంది. డీసీఎం వెనుక తలుపు కొక్కెం ఊడిపోయి టూ వీలర్ పై వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు తగిలి కిలో మీటరు వరకు ఈడ్చుకెళ్లింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం వనస్థలిపురానికి చెందిన వెంకటేష్‌ ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే రామంతాపూర్‌లో బస్సును నిలిపి బైకుపై ఇంటికి బయలుదేరాడు. అదే దారిలో ఉప్పల్‌-నాగోల్‌ మార్గంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం తలుపునకు వేలాడుతున్న కొక్కెం వెంకటేష్‌ వేసుకున్న రెయిన్‌ కోటుకు తగిలింది.

వెంటనే ద్విచక్ర వాహనం అక్కడే కింద పడిపోయింది. సినిమాలోని ఫైటింగ్ సీన్‌ను ఈ దృశ్యం తలపించింది. వెంకటేష్‌ను డీసీఎం ఈడ్చుకెళ్తున్నా డ్రైవర్‌కు కనిపించలేదు. బాధితుడు అరుస్తున్నా వినిపించలేదు. వాహనదారులూ పట్టించుకోలేదు. నాగోల్‌ చౌరస్తా వరకు అలాగే ఈడ్చుకెళ్లింది. నాగోల్‌ చౌరస్తాలో రెయిన్‌ కోటు చినిగిపోవడంతో వెంకటేష్‌ రోడ్డుపై పడిపోయాడు. అప్పటికే తలకు, పక్కటెముకలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలైన అతన్ని స్థానికులు 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఉప్పల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.