కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర రోడ్డు ప్రమాదం, అతివేగంతో చెట్టుని ఢీకొట్టి నుజ్జు నుజ్జయిన కారు

|

Dec 23, 2020 | 8:22 AM

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ అంకుర్ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు...

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ దగ్గర రోడ్డు ప్రమాదం, అతివేగంతో చెట్టుని ఢీకొట్టి  నుజ్జు నుజ్జయిన కారు
Follow us on

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ అంకుర్ ఆసుపత్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ఫుట్ పాత్ పైకి దూసుకొచ్చి.. ఆ తర్వాత చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో AP 10 AW 5669 నెంబర్ కారు చెట్టుని నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఎయిర్ బ్యాగ్స్  ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. BHEL బీరంగూడ కి చెందిన ప్రణీత్ తో పాటు మరో యువతి కారులో మాదాపూర్‌లోని పార్టీకి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై కేసు నమోదు చేశారు హౌసింగ్ బోర్డు పోలీసులు.