రెండో టెస్టులో తడబడిన పాకిస్థాన్..

రెండో టెస్టులో తడబడిన పాకిస్థాన్..

సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 223 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Ravi Kiran

|

Aug 14, 2020 | 10:17 PM

England Vs Pakistan: సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 223 పరుగులకు 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అబిద్ అలీ(60), మొహమ్మద్ రిజ్వాన్(60*) అర్ధ శతకాలకు తోడు బాబర్ ఆజామ్(47) మరోసారి సత్తా చాటడంతో పాక్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ప్రస్తుతం రిజ్వాన్, నసీం షాలు క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సామ్ కర్రన్, వోక్స్ చెరో వికెట్ తీశారు. కాగా, మొదటి టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్ లో వోక్స్, బట్లర్ అద్భుతమైన అర్ధ శతకాలు ఇంగ్లాండ్ కు విజయాన్ని కట్టబెట్టాయి.

Also Read:

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu