రైట్స్ తో కుదిరిన రైల్వేస్ ఒప్పందం..

|

May 22, 2020 | 7:17 PM

ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (IRSDC)తో భారత్‌కే చెందిన రైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం IRSDCలో రైట్స్‌ సంస్థ 24 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ కీలక ఒప్పందంపై సంతకం చేసినట్లు రైట్స్‌ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పునరుద్ధరణ, అభివృద్ధి పనులను IRSDC చేపడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో తాము పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని, అందులో IRSDCతో […]

రైట్స్ తో కుదిరిన రైల్వేస్ ఒప్పందం..
Follow us on

ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (IRSDC)తో భారత్‌కే చెందిన రైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం IRSDCలో రైట్స్‌ సంస్థ 24 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ కీలక ఒప్పందంపై సంతకం చేసినట్లు రైట్స్‌ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పునరుద్ధరణ, అభివృద్ధి పనులను IRSDC చేపడుతోంది.
లాక్‌డౌన్‌ సమయంలో తాము పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకున్నామని, అందులో IRSDCతో జరిగిన ఒప్పందంతోపాటు ఆఫ్రికాకు ఎగుమతులకు సంబంధించిన ఒప్పందాలు కీలకమైనవని రైట్స్‌ సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ మల్హోత్రా తెలిపారు. తాజాగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ఇక తమ కార్యక్రమాలు వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. కాగా, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగానే కేంద్రం ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటోందని ప్రచారం సాగుతోంది.