ప్రాక్టీస్​లో సిక్సులతో అదరగొట్టిన పంత్

|

Sep 08, 2020 | 10:05 PM

భారత క్రికెట్ జట్టులో ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని నిలుపుకోవడంలో విఫలమయ్యాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.

ప్రాక్టీస్​లో సిక్సులతో అదరగొట్టిన పంత్
Follow us on

భారత క్రికెట్ జట్టులో ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని నిలుపుకోవడంలో విఫలమయ్యాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కీపింగ్​ బాధ్యతలు చేపట్టి  బాగానే రాణించాడు. ఫలితంగా పంత్ స్థానంపై భారీ పోటీ ఏర్పడింది. అయితే ఈసారి ఐపీఎల్​లో సత్తాచాటి ఇండియా టీమ్ లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలన్న కసితో ఉన్నాడు పంత్. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్​ సెషన్​లో సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు ఈ కుర్రాడు. ఆ జట్టు స్పిన్నర్ల బౌలింగ్​లో సిక్సర్లతో మోత మోగించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్​గా మారింది.