తెలివిగలవాళ్లు టీచర్లవరు: రామ్ గోపాల్ వర్మ

|

Sep 05, 2020 | 1:58 PM

ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకం ఆర్జీవీ. ప్రతీ విషయాన్నీ విభిన్నమైన కోణంలో చూడ్డం.. తనకు ఏం తోచిందో అదే నెట్టింట్లో పెట్టటం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి అలవాటు.

తెలివిగలవాళ్లు టీచర్లవరు: రామ్ గోపాల్ వర్మ
Follow us on

ఎడ్డెం అంటే తెడ్డెం అనే రకం ఆర్జీవీ. ప్రతీ విషయాన్నీ విభిన్నమైన కోణంలో చూడ్డం.. తనకు ఏం తోచిందో అదే నెట్టింట్లో పెట్టటం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి అలవాటు. ఇవాళ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 5న భారత దేశమంతా టీచర్స్ డే జరుపుకుంటున్నారు. దీంతో నెటిజన్లు చాలా మంది తమ టీచర్లకు ఏకబిగిన శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు. అయితే, రాము మాత్రం ‘అన్ హ్యాపీ టీచర్స్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్ తో రంగంలోకి దూకాడు. ఊరికే అంటున్నా.. తెలివిగల వ్యక్తులు ఉపాధ్యాయులుగా మారరని నాకు ఎవరో చెప్పారు. ఎందుకంటే వాళ్లు ఏమీ తెలియనివారితో నిండిన క్లాస్ లో కూర్చుని బోధించడానికి తమ సమయాన్ని వృథా చేయరు అంటూ చెప్పుకొచ్చాడు. నేనైతే ఎవరి దగ్గరా నేర్చుకోను.. ఎవరికీ బోధించను ఇదే నేను నేర్చుకున్న పాఠం అంటూ సెలవిచ్చాడు. దీనిపై ఎవరికొచ్చిన రీతిన వాళ్లు ట్విట్టర్లో స్పందిస్తున్నారు.