జవాన్లకు గుడ్ న్యూస్.. త్వరలో పదవీ విరమణ వయసు పెంపు..!

| Edited By:

May 14, 2020 | 12:35 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది పదవీ విరమణ వయసును పొడిగిస్తామని చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించారు.

జవాన్లకు గుడ్ న్యూస్.. త్వరలో పదవీ విరమణ వయసు పెంపు..!
Follow us on

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికోసం ప్రపంచ దేశాలన్ని లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సిబ్బంది పదవీ విరమణ వయసును పొడిగిస్తామని చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ ప్రకటించారు. ఈ నిర్ణయంతో సైన్యం, నౌకాదళం, వైమానిక దళంలో పని చేస్తోన్న 15 లక్షల మంది సిబ్బందికి లాభం చేకూరనుందని ఆయన వెల్లడించారు.

మరోవైపు.. ఈ మేరకు త్వరలోనే ఓ విధానాన్ని తీసుకు వస్తామన్నారు. ‘ఓ జవాన్‌ కేవలం 15 నుంచి 17 సంవత్సరాలు మాత్రమే ఎందుకు సేవలందించాలి.. 30 ఏళ్ల వరకు సేవ చేస్తే తప్పేముంది’ అన్నారు. త్రివిధ దళాల్లో పదవీ విరమణ వయసు తక్కువగా ఉన్నందున అత్యద్భుతంగా శిక్షణ పొందిన మానవ వనరులను స్వల్ప కాలంలోనే మనం కోల్పోతున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా.. యుద్ధ సమయంలో మాత్రం ముందుండి పోరాడేది యుక్త వయసు వారేనని రావత్‌ తెలిపారు. సైన్యంలోని వైద్య విభాగంలో పనిచేసే నర్సింగ్‌ అసిస్టెంట్స్‌ 50 ఏళ్ల వరకు సేవలందిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

Also Read: కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్‌’.. ఇక హైదరాబాద్‌లో తయారీ..!