Hot-spots హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో ఆంక్షలివే

| Edited By: Pardhasaradhi Peri

Apr 10, 2020 | 2:37 PM

కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి దిగ్బంధనం చేశారు పోలీసులు.

Hot-spots హాట్ స్పాట్స్ ప్రాంతాల్లో ఆంక్షలివే
Follow us on

Restrictions in corona hot-spots: కరోనా వైరస్‌ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాలలో బారికేడ్లు ఏర్పాటు చేసి దిగ్బంధనం చేశారు పోలీసులు. మరి హాట్‌స్పాట్‌గా గుర్తించిన ప్రాంతాలలో జనజీవనం ఎలా ఉంటుంది? వీరికి కావలసిన నిత్యావసరవస్తువులు ఎవరు, ఎలా సమకూరుస్తారు? ఎన్ని రోజుల పాటు ప్రజలు గడపదాటి రాకుండా ఉండాలి? ఇవిప్పుడు సామాన్య ప్రజల్లో చెలరేగుతున్న సందేహాలు.

కరోనా హాట్‌స్పాట్‌లను ముందుగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఆ ప్రాంతానికి దాదాపు కిలోమీటర్‌ పరిధిలో ఎవరినీ బయటకు వెళ్లనివ్వరు. జన సంచారం పూర్తిగా నిషేధిస్తారు. సూటిగా చెప్పాలంటే ఆ ప్రాంతమంతా క్వారంటైన్‌ అయినట్టే! వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతవాసులంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావడానికి వీలులేదు. ఎవరికైనా అత్యవసర సమస్యలు ఉత్పన్నమయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అందుకు ప్రత్యేకంగా ఫోన్‌ నంబర్లు ఇస్తారు.

 

ఇక ప్రతీ రోజూ నిత్యావసరాలు ఇంటికే వస్తాయి. ఈ బాధ్యతలన్నీ ఆయా జిల్లాల కలెక్టర్లు, మార్కెటింగ్‌, పౌర సరఫరా శాఖ, బల్దియా సమన్వయం చేసుకుని పోలీసుల సమక్షంలో పంపిణీ చేస్తాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో 12 ప్రాంతాలను కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ప్రకటించారు అధికారులు. సాధారణంగా 14 రోజుల పాటు ఆ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇంటింటి సర్వే చేస్తారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ 14 రోజుల్లో ఏ రోజైనా పాజిటివ్‌ కేసు నమోదు అయినా మరో 14 రోజులు దిగ్బంధనం పెంచుతారు. అక్కడి ప్రజలకు నెగటివ్‌ వచ్చేంత వరకు ఆ ప్రాంతాలు పోలీసుల కనుసన్నలోనే ఉంటాయి.