రివ్యూ పిటిషన్ వేస్తాం.. సున్నీ వక్ఫ్ బోర్డు

|

Nov 09, 2019 | 2:32 PM

రామజన్మభూమి న్యాస్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ జఫర్యాబ్ జిలానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ మాకు మాత్రం అసంతృప్తిని మిగిల్చిందని ఆయన అన్నారు. ఈ కేసులో సున్నీ వక్ఫ్ బోర్డుకు.. మసీదు నిర్మాణానికి అనువుగా వేరొక చోట ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి విదితమే. ఈ తీర్పు[పై రివ్యూ పిటిషన్ వేస్తాం.. తీర్పులో పరస్పర వైరుధ్యాలు […]

రివ్యూ పిటిషన్ వేస్తాం.. సున్నీ వక్ఫ్ బోర్డు
Follow us on

రామజన్మభూమి న్యాస్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ జఫర్యాబ్ జిలానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామని, కానీ మాకు మాత్రం అసంతృప్తిని మిగిల్చిందని ఆయన అన్నారు. ఈ కేసులో సున్నీ వక్ఫ్ బోర్డుకు.. మసీదు నిర్మాణానికి అనువుగా వేరొక చోట ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్న సంగతి విదితమే. ఈ తీర్పు[పై రివ్యూ పిటిషన్ వేస్తాం.. తీర్పులో పరస్పర వైరుధ్యాలు చాలా ఉన్నాయి అని జిలానీ పేర్కొన్నారు .తాము న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు ఆయన తెలిపారు. మా కమిటీ అంగీకరించిన పక్షంలో రివ్యూ పిటిషన్ వేయడం తప్పనిసరని, ఇది తమ హక్కని ఆయన అన్నారు.అయితే.. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో ఉండాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హర్షం వ్యక్తం చేశారు. రామ్ లాలా న్యాస్ కు ‘ న్యాయం ‘ జరిగిందని ఆయన చెప్పారు.