కర్మయోగి పీవీ శత జయంతి

|

Jun 28, 2020 | 9:22 AM

బహుముఖ ప్రజ్ఞాశాలి… బహుభాషా కోవిదుడు.. అపర చాణిక్యుడు.. రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా.. కేంద్రమంత్రిగా.. ప్రధాన మంత్రిగా.. అన్ని పదవులు ఆయన అధిష్టించిన స్థానాలే… ఏ పదవి చేపట్టినా… ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. సామర్ధ్యం ,నిజాయితీ ,చిత్తశుద్ధి, వినయం, వివేకం,పోరాట పథం…ఇవన్నీ ఒక్కచోట కుప్పగా పేర్చితే అదే పీవీ నరసింహారావు. ఇలాంటివారు బహు అరుదు…అలాంటి ఓ అరుదైన వ్యక్తి పి.వి… ఈ బలాలే ఓ మారు మూల పల్లెలో […]

కర్మయోగి పీవీ శత జయంతి
Follow us on

బహుముఖ ప్రజ్ఞాశాలి… బహుభాషా కోవిదుడు.. అపర చాణిక్యుడు.. రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా.. కేంద్రమంత్రిగా.. ప్రధాన మంత్రిగా.. అన్ని పదవులు ఆయన అధిష్టించిన స్థానాలే… ఏ పదవి చేపట్టినా… ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం.

సామర్ధ్యం ,నిజాయితీ ,చిత్తశుద్ధి, వినయం, వివేకం,పోరాట పథం…ఇవన్నీ ఒక్కచోట కుప్పగా పేర్చితే అదే పీవీ నరసింహారావు. ఇలాంటివారు బహు అరుదు…అలాంటి ఓ అరుదైన వ్యక్తి పి.వి… ఈ బలాలే ఓ మారు మూల పల్లెలో పుట్టిన ఆయన్ను అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళాయి. హిందీ యేతర రాష్ట్రాల నుంచి ప్రధాని పీఠం పై నిలిచిన తొలివ్యక్తిగా ఆయన నిలిచారు. కాంగ్రెస్ నెహ్రూ, గాంధీ “కుటుంబ వారసత్వ ఆస్తి” కాదని కూడా నిరూపించారు. భవిష్యత్‌ తరాలకు ఆదర్శంగా నిలిచారు. స్వతంత్ర భారతానికి ఆర్థిక సంస్కరణల ప్రదాత.. పాములపర్తి వెంకట నరసింహారావు శతజయంతి నేడు.

భారత ప్రధానిగా సేవలందించిన పీవీ శత జయంతి వేడుకల్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పీవీ జయంతి వేడుకలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి అత్యున్నత స్థాయి పదవికి ఎదిగిన పీవీ నర్సింహారావు దేశాభివృద్ధికి విశేష కృషి చేశారు. సంక్షోభ సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ దేశాన్ని ముందుండి నడిపారు. తనదైన సంస్కరణలతో దేశ ప్రగతికి బాటలు వేశాడు.