Andhra Pradesh : సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ..ఎందుకంటే..?

|

Feb 29, 2020 | 5:56 PM

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో  దిగ్గజ  వ్యాపార వేత్త,  రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ సమావేశంలో ముఖేశ్ కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ పాల్గొన్నారు.

Andhra Pradesh :  సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ..ఎందుకంటే..?
Follow us on

Andhra Pradesh :  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌తో  దిగ్గజ  వ్యాపారవేత్త,  రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ సమావేశంలో ముఖేశ్ కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ పాల్గొన్నారు. ఇటీవలే సీఎం జగన్ 3 రాజధానులు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజా భేటీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దాదాపు గంటన్నరసేపు ఈ భేటీ కొనసాగింది. మొదట గన్నవరం విమానాశ్రయంలో ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీకి స్వాగతం పలికారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మరికొందరు నేతలు.

ఇక ఏపీని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేవిదంగా సీఎం ప్రణాళికలు రచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా రేణికుంటలో  రూ. 15 వందల కోట్ల పెట్టుబడులు పెడతామన్న రిలయన్స్..ఇటీవల కాలంలో వెనక్కి తగ్గిందనే వార్తలు వినిపించాయి. దీనిపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.  తాజా భేటీలో అందుకు సంబంధించిన చర్చ ఏమైనా జరిగిందా అనే అంశం తెలియాల్సి ఉంది. సమావేశం ముగిసిన అనంతరం సీఎం నివాసం నుంచి తిరిగి ముంబైకు బ‌య‌లుదేరి వెళ్లారు ముకేష్ అంబానీ. ఆసియాలోని బిలియనీర్స్ లిస్ట్‌లో టాప్‌లో కొనసాగుతోన్న ముఖేశ్ అంబానీ సంపాదన గంటకు అక్ష‌రాలా.. ఏడు కోట్ల రూపాయలు.

 

ఇది కూడా చదవండి : సీఎం జగన్ కీలక నిర్ణయం..నియోజకవర్గానికో మానసిక వికలాంగుల పాఠశాల..