ఈ రోజు గుడ్డు ధర ఎంతో తెలుసా…

|

Nov 08, 2020 | 2:51 PM

కోడి గుడ్డు దిగివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్ని తాకిన కోడి గుడ్డు ధర ఇప్పుడు నెమ్మదిగా దిగి వస్తోంది. రాష్ట్రంలో మొన్నటి దాకా రిటైల్‌గా రూ.8 వరకు అమ్మిన గుడ్డు ఇప్పుడు రూపాయి తగ్గింది. మధ్యతరగతి కుటుంబాల్లో సైతం గుడ్డు రోజూ మెనూలో భాగం కావడం గుడ్డు ధర పెరగడానికి కారణంగా భావిస్తున్నా పరిశ్రమల వర్గాలు. కోడిగుడ్ల రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఉత్పత్తి 50% వరకు తగ్గిపోవడం. ఇక ప్రస్తుత కోవిడ్ సమయంలో రోగనిరోధక శక్తి […]

ఈ రోజు గుడ్డు ధర ఎంతో తెలుసా...
Follow us on

కోడి గుడ్డు దిగివచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్ని తాకిన కోడి గుడ్డు ధర ఇప్పుడు నెమ్మదిగా దిగి వస్తోంది. రాష్ట్రంలో మొన్నటి దాకా రిటైల్‌గా రూ.8 వరకు అమ్మిన గుడ్డు ఇప్పుడు రూపాయి తగ్గింది. మధ్యతరగతి కుటుంబాల్లో సైతం గుడ్డు రోజూ మెనూలో భాగం కావడం గుడ్డు ధర పెరగడానికి కారణంగా భావిస్తున్నా పరిశ్రమల వర్గాలు. కోడిగుడ్ల రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఉత్పత్తి 50% వరకు తగ్గిపోవడం. ఇక ప్రస్తుత కోవిడ్ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకోడానికి జనాలు కూడా గుడ్డును బాగా తింటున్నారు.

నెక్‌(నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ) నిర్ణయం ప్రకారం హోల్‌సేల్‌గా 100 గుడ్లు గత నెలలో రూ.550 వరకు విక్రయించగా, ఇప్పుడు రూ.480కి తగ్గింది. హైదరాబాద్‌లో ఇంకాస్త తక్కువగానే ఉంది. కొత్త బ్యాచ్‌ కోళ్లు గుడ్లు పెట్టే దశకు చేరడంతో గుడ్ల ఉత్పత్తి కాస్త పెరిగింది. దీంతో ధర కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ఏపీలో 4కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా.

ఇక కరోనా ప్రభావం మన దేశంలో ప్రారంభమైన సమయంలో చికెన్, గుడ్లు రేట్లు భారీగా పడిపోయాయి. దీంతో చాలా చోట్ల పౌల్ట్రీ నిర్వాహకులు వ్యాపారం నుంచి పక్కకు తప్పుకున్నారు. లాక్‌డౌన్‌ కష్టాల వల్ల మూడు నెలలు పాటు దాణా రవాణా నిలిచిపోవడంతో లక్షల్లో కోళ్లు చనిపోయాయి. దీంతో గుడ్ల ఉత్పత్తి ఊహించనంతగా పడిపోయింది. ప్రస్తుతం  లాక్‌డౌన్‌ సడలించడంతో తిరిగి పౌల్ట్రీ పరిశ్రమ మళ్లీ పుంజుకుంటోంది.