అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా.. తెలుగు ఐఏఎస్ అధికారి..

| Edited By:

Jun 04, 2020 | 3:54 PM

అమెరికాలో.. భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి రవి కోట నియమితులయ్యారు. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవి కోట వాషిగ్టంట్ (డీసీ)లోని

అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా.. తెలుగు ఐఏఎస్ అధికారి..
Follow us on

అమెరికాలో.. భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా తెలుగు ఐఏఎస్ అధికారి రవి కోట నియమితులయ్యారు. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రవి కోట వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు నిర్వహించనున్నారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. రవి కోటపై భారత్‌లోకి అమెరికా పెట్టుబడులు, ఆర్థిక ఒప్పందాల బాధ్యతలు ఉన్నాయి. భారత్ తరఫున రవి కోట వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ సమావేశాలకు హాజరుకానున్నారు. రవి కోట 1993 బ్యాచ్ అస్సాం క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆయన రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వహించారు. వారి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటపాడు గ్రామం.

Also Read: టెన్త్ విద్యార్థుల కోసం.. నేటి నుంచి తెరుచుకోనున్న సంక్షేమ హాస్టళ్లు..