స్క్రిప్ట్ రెడీ.. త్వరలోనే షూట్ ప్రారంభం..!

| Edited By:

Aug 02, 2019 | 12:11 PM

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఫుల్‌ స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్‌కు వినిపించేశారని టాక్ నడుస్తోంది. కథ విని, బన్నీ ఫుల్‌ ఖుష్‌ అయ్యారని సమాచారం. ఇక హీరోకి నచ్చాక స్క్రిప్ట్‌ లాక్‌ చేసేస్తారు కదా. అయితే షూటింగ్ ప్రారంభించడానికి మంచి ముహూర్తం […]

స్క్రిప్ట్ రెడీ.. త్వరలోనే షూట్ ప్రారంభం..!
Follow us on

వరుస హిట్‌లతో దూసుకుపోతున్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే సుకుమార్‌ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్‌తో బిజీ బిజీగా కనిపించనున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా ఫుల్‌ స్క్రిప్ట్‌ను అల్లు అర్జున్‌కు వినిపించేశారని టాక్ నడుస్తోంది. కథ విని, బన్నీ ఫుల్‌ ఖుష్‌ అయ్యారని సమాచారం. ఇక హీరోకి నచ్చాక స్క్రిప్ట్‌ లాక్‌ చేసేస్తారు కదా. అయితే షూటింగ్ ప్రారంభించడానికి మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాకినాడ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు అల్లు అర్జున్‌.