Rare skin disease: బాలుడి ఒంటి నుంచి కారుతోన్న రక్తం..ఏంటా మిస్టరీ..!

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 4:56 PM

మనిషికి చెమట కారడం నార్మలే .. కాని చెమటగా రక్తం కారడం ..ఆ కారిన ప్రతీసారీ ఒల్లంతా నొప్పి పుట్టడం...వినడానికే భయంకరంగా ఉంది కదా..పగోడికి కూడా ఆ కష్టం రావొద్దనుకుంటాం..కాని ఇక్కడో పసివాడు అంతుచిక్కని ఆ భయంకర వ్యాధితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు..తొటి పిల్లలతో ఆడి పాడి ఆనందంగా గడపాల్సిన వయసులో రక్తంతో సావాసం చేస్తున్నాడు.

Rare skin disease: బాలుడి ఒంటి నుంచి కారుతోన్న రక్తం..ఏంటా మిస్టరీ..!
Follow us on

Rare skin disease:  మనిషికి చెమట కారడం నార్మలే .. కాని చెమటగా రక్తం కారడం ..ఆ కారిన ప్రతీసారీ ఒల్లంతా నొప్పి పుట్టడం…వినడానికే భయంకరంగా ఉంది కదా..పగోడికి కూడా ఆ కష్టం రావొద్దనుకుంటాం..కాని ఇక్కడో పసివాడు అంతుచిక్కని ఆ భయంకర వ్యాధితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు..తొటి పిల్లలతో ఆడి పాడి ఆనందంగా గడపాల్సిన వయసులో రక్తంతో సావాసం చేస్తున్నాడు.

నల్గొండజిల్లా మాడ్గుపల్లి మండలం, పొరెడ్డిగూడెంకు చెందిన వెంకట్ రెడ్డి కొడుకు శంకర్‌రెడ్డిని చుట్టుముట్టిందీ వ్యాధి..తొలుత చెవినుండి మాత్రమే రక్తం కారేది ..నల్గొండలో చెవి డాక్టర్‌కి చూయించగా చిన్న ఆపరేషన్‌తో దాన్ని నయం చేశాడు ..అయితే కొద్ది రోజులకి గానీ తెలీలేదు మున్మందు మరో భయంకర దృశ్యం చూడాల్సొస్తుందని..ఒక్క చెవి నుండి మాత్రమే కాకుండా శరీరంలోని అన్ని భాగాల నుంచి రక్తం కారడం స్టార్ట్‌ అయ్యింది..ఒల్లంతా రక్తంతో శంకర్‌రెడ్డి బాడీ భయకరంగా మారింది. ఈ అంతుచిక్కని వ్యాధి తన పసి హృదయానికి అర్థం కాక అయోమయం అవుతున్నాడు ఆ బాలుడు..తోటి పిల్లలు తనతో ఆడుకోవట్లేదని అమాయకంగా తన బాధ చెప్పుకుంటున్నాడు..

మరోవైపు కొడుకు బాధ చూడలేని తండ్రి శంకర్‌రెడ్డి, తిరగని చోటు లేదు.. కలవని డాక్టర్ లేడు..ఆఖరికి భూత వైద్యున్ని సంప్రదించి ఐనా కొడుకు వ్యాధిని నయం చేయాలనుకున్నాడు..కాని ఎక్కడికి వెళ్లినా ఫలితం శూన్యం.. తోటి పిల్లలు కళ్ల ముందు ఆడుకుంటుంటే కన్నకొడుకు మాత్రం రక్తంతో రోదిస్తుండడం చూసి తట్టుకొలేకపోతున్నాడు ఆ తండ్రి. అయితే వెంకట్‌రెడ్డికి చివరికి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కొంత స్వాంతన దొరికింది..అక్కడ డాక్టర్ సురేష్ ఆ బాలుడికి సంబంధించిన పాత రిపోర్ట్‌లు అన్నీ తిరగేసి ఇంటర్నెట్‌లో వైద్యరంగానికి చెందిన లిటరసీ జనరల్స్‌లో సెర్చ్‌చేయగా..శంకర్‌రెడ్డి అతి అరుదైన హెమటైడ్రోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు గుర్తించాడు..కొద్దిరోజులు ఆసుపత్రిలో ఇన్‌ఫేషెంట్‌గా ఉంచి వైద్యం అందించారు..దీంతో కొంతకాలం నుంచి శరీర భాగాల నుంచి రక్తం కారడం తగ్గుముఖం పట్టింది..