ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు.. ఇక శరవేగంగా టెస్టింగ్

|

Apr 17, 2020 | 1:03 PM

ఏపీలో ఇకపై శరవేగంగా కరోనా వైరస్ పరీక్షలు జరగనున్నాయి. దక్షిణ కొరియా నుంచి ఏకంగా లక్ష టెస్ట్ కిట్లను తెప్పించింది జగన్ ప్రభుత్వం. ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కరోనా టెస్టు పూర్తి అయి, రిపోర్టు వచ్చేస్తుంది.

ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు.. ఇక శరవేగంగా టెస్టింగ్
Follow us on

ఏపీలో ఇకపై శరవేగంగా కరోనా వైరస్ పరీక్షలు జరగనున్నాయి. దక్షిణ కొరియా నుంచి ఏకంగా లక్ష టెస్ట్ కిట్లను తెప్పించింది జగన్ ప్రభుత్వం. ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కరోనా టెస్టు పూర్తి అయి, రిపోర్టు వచ్చేస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ నుంచి ప్రత్యేక కార్గో విమానంలో శుక్రవారం ఉదయం లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరుకున్నాయి.

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఈ కిట్లను నేరుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి తరలించగా.. వాటి వాడకానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. ఇకపై కేవలం పది నిమిషాల వ్యవధిలోనే కరోనా వైరస్ పాజిటివ్ లేదా నెగెటివ్ తేలిపోనుంది. కమ్యూనిటీ టెస్టింగ్‌ కోసం ర్యాపిడ్‌ కిట్లను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. 4–5 రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ ర్యాపిడ్ టెస్టు కిట్లను పంపిస్తామన్న అధికారులు.. ఇకపై వేగంగా కరోనా టెస్టులు పూర్తవుతాయని చెబుతున్నారు.