Rana’s Mission Frontline: భద్రతాదళాలతో కలిసి పనిచేయడం మరచిపోలేని మధుర జ్ఞాపకం..ఆర్మీ మెమోరీస్‌లో భల్లాలదేవ

| Edited By: Rajesh Sharma

Jan 15, 2021 | 1:43 PM

దగ్గుబాటి వారసుడుగా లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రానా డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న రానా కొన్ని కొన్ని అనుభవాలను ఎప్పటికీ మరిచిపోలేం... జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని..

Rana’s Mission Frontline: భద్రతాదళాలతో కలిసి పనిచేయడం మరచిపోలేని మధుర జ్ఞాపకం..ఆర్మీ మెమోరీస్‌లో భల్లాలదేవ
Follow us on

Rana’s MissionFrontline Documentary: దగ్గుబాటి వారసుడుగా లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన రానా డిఫరెంట్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న రానా కొన్ని కొన్ని అనుభవాలను ఎప్పటికీ మరిచిపోలేం… జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని అంటున్నాడు. అయితే అవి పెళ్ళికి సంబధించిన మధుర జ్ఞాపకాలు కాదు సుమా.. ఈ భళ్లాలదేవ ఎవరికీ తెలియకుండా అత్యంత సీక్రెట్ గా ఓ పని చేశాడు..

సరిహద్దు భద్రతా దళాలతో కలిసి పనిచేశాడు రానా.. అయితే ఇలా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ తో కలిసి వారి మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించాడు. బోర్డర్‌ ఫోర్సెస్‌ మీద డిస్కవరీ ప్లస్‌తో కలిసి ‘మిషన్‌ ఫ్రంట్‌ లైన్‌’ పేరుతో ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ గురించి ప్రస్తావిస్తూ రానా .. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ , డిస్కవరీ ప్లస్ వారికీ కృతఙ్ఞతలు తెలిపాడు. తనకు జీవితంలో అద్భుతమైన అనుభవాన్ని కలిగించిన మీకు సర్వదా కృతజ్ఞుడిని తెలిపాడు. మిషన్‌ ఫ్రంట్‌లైన్‌ పేరుతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. జనవరి 21న హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది అని ట్వీట్‌ చేశారు రానా దగ్గుబాటి. శత్రువుల బారి నుండి మన దేశాన్ని మనల్ని కాపాడటానికి సరిహద్దుల వద్ద రాత్రనక పగలనక కాపలాకాస్తూ సైనికులు ఎంతో కష్టపడుతుంటారు. తమ కుటుంబాలను, ప్రాణాలనుఁ సైతం లెక్కచేయకుండా అహోరాత్రులు దేశం కోసం పనిచేస్తున్న జవాన్ల జీవితం గురించి డాక్యుమెంటరీ అంటే సహస చర్య అనే అంటున్నారు. మరి అలాంటి సైనికుల పై డ్యాక్యుమెంటరీ అంటే అందుకో ఏమి చూపిస్తారో అని ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు.

అనారోగ్యంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రానా చికిత్స అనంతరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాడు. కరోనా సమయంలో మిహికా బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. మరోవైపు వరస సినిమాలతో కెరీర్ లో బిజిబిజిగా ఉన్నాడు. ఈ ప్యాన్ ఇండియా యాక్టర్ రానా. విరాట పర్వం, సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నాడు

Also Read: బిగ్ బాస్ సీజన్ 4 విజేతకు టీమిండియా వైస్ కెప్టెన్ నుంచి ఊహించని బహుమతి.. గాలిలో తేలిపోతున్న అభిజిత్