rana celebrate his wife birthday: లాక్డౌన్ సమయంలో వివాహం చేసుకున్న సెలబ్రిటీల్లో యంగ్ హీరో రానా దగ్గుబాటి ఒకరు. సన్నిహితులు, బంధువుల సమక్షంలో తన స్నేహితురాలు మిహికాను గత ఆగస్టులో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రానా తన భార్యతో గడిపిన మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా రానా తన సతీమణి మిహికా పుట్టిన రోజు వేడుకను ఇంట్లోనే సెలబ్రేట్ చేశాడు. అర్ధరాత్రి పిజ్జా క్యాండిల్ లైట్ డిన్నర్‌ను ఏర్పాటు చేసి భార్యకు సర్ప్రైజ్ ఇచ్చాడు.
ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రానా ఫన్నీ కామెంట్‌ను జోడించాడు. ‘ఈ రోజు పెళ్లామ్స్ బర్త్‌డే.. కాబట్టి నాకు హాలీడే’ అని కామెంట్ చేశాడు. ఇక ఇదే ఫొటోను మిహికా షేర్ చేస్తూ.. ‘నా బలవంతంగా తీసుకున్న హాలీడ్’ అంటూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే రానా ప్రస్తుతం.. ‘విరాటపర్వం’ ‘అరణ్య’ ‘1946’ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు.