ఈ కథల్లోని జీవన రహస్యం నేర్పిస్తాం…

|

Sep 22, 2020 | 7:48 PM

పంచతంత్ర కథల్లోని నీతి ఎంతో విలువైనది. ప్రాచీన భారతీయ సాహిత్యానికి ప్రతీకగా కూడా అది నిలుస్తుంది. ఆ కథల్లోని సారం అర్థం చేసుకుంటే జీవనయానం సాఫీగా చేయొచ్చని విజ్ఞులు..

ఈ కథల్లోని జీవన రహస్యం నేర్పిస్తాం...
Follow us on

Panchatantra Stories : పంచతంత్ర కథల్లోని నీతి ఎంతో విలువైనది. ప్రాచీన భారతీయ సాహిత్యానికి ప్రతీకగా కూడా అది నిలుస్తుంది. ఆ కథల్లోని సారం అర్థం చేసుకుంటే జీవనయానం సాఫీగా చేయొచ్చని విజ్ఞులు చెబుతుంటారు. ఈ అద్భుత పంచతంత్ర కథలపై సర్టిఫికేట్ కోర్సును అందించేందుకు రామకృష్ణ మఠం ఆధ్వర్యంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ సిద్ధమైంది.

‘‘ప్రాచీన భారతీయ కథల్లోని విజ్ఞానం.. పంచతంత్ర కథలపై ప్రత్యేక దృష్టి’’ అనే అంశంపై 20 రోజులు ఆన్ లైన్ తరగతులు నిర్వహించి.. సర్టిఫికేట్లను ఇవ్వనున్నారు. ఐఐఎం అహ్మదాబాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎన్. రవిచంద్రన్ క్లాసులు తీసుకోనున్నారు.

అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 30 వరకు ఆన్‌లైన్ క్లాసులు జరగనున్నాయని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు . ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. 18 ఏళ్లకు పైబడిన వారంతా అర్హులే. ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకావడం తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు.