శనివారం రాంవిలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు

|

Oct 09, 2020 | 10:57 AM

కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

శనివారం రాంవిలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు
Follow us on

కేంద్ర మంత్రి, ఎల్జేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ అంత్యక్రియలు శనివారం జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆస్పత్రి నుంచి కడసారి చూపు కోసం ఢిల్లీలోని ఆయన నివాసానికి భౌతికకాయం తరలించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ అక్కడే ఉంచనున్నారు. ఢిల్లీ నుంచి ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం స్వస్థలమైన పాట్నాకు తరలించనున్నారు. కడసారి చూపుకోసం పార్టీ కార్యాలయంలో పార్థివ దేహాన్ని ఉంచుతారు. శనివారం మధ్యాహ్నం పాశ్వాన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

కేంద్ర మంత్రి, దళిత నేత, లోక్‌ జనశక్తి (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ (74) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయనకు కొద్ది రోజుల కిందటే గుండె శస్త్ర చికిత్స జరిగింది. అయినా, ఆయన కోలుకోలేకపోయారు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తల్లెత్తడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పంపిణీ శాఖ మంత్రిగా ఉన్న పాశ్వాన్‌ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. ఆయన కుమారుడు, ఎల్జేపీ అధినేత చిరాగ్‌ పాశ్వాన్‌- తన తండ్రి మరణవార్తను ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.