Ram Pothineni Turns Chef: చెఫ్‌గా మారిన రామ్..రాశీ ఖన్నా ఫుడ్ ఆర్డర్.. ‘థాయ్ కర్రీ విత్‌ రైస్’ కావాలట

|

Jan 09, 2021 | 2:23 PM

రామ్ పోతినేనికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు అందాల భామ రాశీ ఖన్నా. నాకైతే థాయ్ కర్రీ విత్‌ రైస్ అంటూ డైరెక్ట్‌గా రామ్‌కు ఆర్డర్ వేశారు. అదేంటి ఎనర్జిటిక్‌ హీరో రెస్టారెంట్‌ ఏమైనా ఓపెన్‌ చేశారేమో...

Ram Pothineni Turns Chef: చెఫ్‌గా మారిన రామ్..రాశీ ఖన్నా ఫుడ్ ఆర్డర్.. థాయ్ కర్రీ విత్‌ రైస్ కావాలట
Follow us on

Ram Pothineni Turns Chef: రామ్ పోతినేనికి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు అందాల భామ రాశీ ఖన్నా. నాకైతే థాయ్ కర్రీ విత్‌ రైస్ అంటూ డైరెక్ట్‌గా రామ్‌కు ఆర్డర్ వేశారు. అదేంటి ఎనర్జిటిక్‌ హీరో రెస్టారెంట్‌ ఏమైనా ఓపెన్‌ చేశారేమో అనుకుంటున్నారా..? అలాంటిదేం లేదు. డైరెక్ట్‌గా రామ్‌‌నే వంట చేసి పెట్టమని అడిగేశారు రాశీఖన్నా.

అసలు మ్యాటరేంటంటే.. ప్రజెంట్‌ ‘రెడ్’ ప్రమోషన్‌లో ఫుల్ బిజీగా ఉన్న రామ్‌. షార్ట్ గ్యాప్ దొరకటంతో గరిట చేత పట్టేశారు. వంటింట్లో డబుల్ ఆమ్లెట్‌ వేస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోస్‌ మీద ఫ్యాన్స్‌ నుంచి ఫిలిం స్టార్స్‌ వరకు అంతా ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు. అయితే ఈ ఫోటోస్‌ తో పాటు రామ్‌ చేసిన కామెంట్ కూడా ఇంట్రస్టింగ్ గా మారింది. సిల్వర్ స్క్రీన్‌ మీద యాక్షన్‌, రొమాన్స్‌ ఇరగదీసే రామ్.. సడన్‌గా రూటు మార్చి ‘మగాళ్లు వంటింట్లో కూడా ఉంటారు’ అంటూ చెప్పటం ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. రామ్‌ గరిటపట్టడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఆ మధ్య క్రిస్మస్‌ రోజు కూడా తన ఫ్యామిలీ కోసం చెఫ్ అవతారం ఎత్తారు రామ్‌. కాగా తనకు నచ్చిన ఫుడ్ తానే చేసుకోవడం ఎంతో ఇష్టంగా ఉంటుంది అని పదే, పదే చెబుతుంటారు ఈ ఎనర్జిటిక్ హీరో.

Also Read :

Sheep Distribution: గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్.. మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి