పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన చెర్రీ

| Edited By:

Aug 29, 2019 | 7:57 AM

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు దగ్గరపడుతోంది. ఈ సెప్టెంబర్ 2న పవన్ 48వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అభిమానులు ఓ వైపు సిద్ధమౌతుండగా.. మరోవైపు ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చాడు రామ్ చరణ్. ఆయన పుట్టినరోజు కోసం కామన్ డీపీని విడుదల చేశాడు చెర్రీ. ఆ డీపీలో ఓ ఫొటోలో పవన్ నవ్వుతూ ఉండగా.. మరో ఫొటోలో ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు. అంతేకాదు ఈ పోస్టర్‌లో జనసేనాని అనే టైటిల్‌.. మార్పు […]

పవన్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన చెర్రీ
Follow us on

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు దగ్గరపడుతోంది. ఈ సెప్టెంబర్ 2న పవన్ 48వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అభిమానులు ఓ వైపు సిద్ధమౌతుండగా.. మరోవైపు ఫ్యాన్స్‌కు గిఫ్ట్‌ ఇచ్చాడు రామ్ చరణ్. ఆయన పుట్టినరోజు కోసం కామన్ డీపీని విడుదల చేశాడు చెర్రీ. ఆ డీపీలో ఓ ఫొటోలో పవన్ నవ్వుతూ ఉండగా.. మరో ఫొటోలో ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు. అంతేకాదు ఈ పోస్టర్‌లో జనసేనాని అనే టైటిల్‌.. మార్పు వచ్చే వరకు ఎత్తులేస్తా అనే కామెంట్‌ ఉంది.

దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేసిన చెర్రీ.. కల్యాణ్ బాబాయి పుట్టినరోజుకు ఇది కామన్ డీపీ. ప్రజలకు మంచి చేయాలని ఆయన ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటారు. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు మనందరం ఏకతాటిపైన నిలబడదాం అని కామెంట్ పెట్టాడు. ఇక ఈ ఫొటోను రామ్ చరణ్ పెట్టిన కాసేపటికే.. మెగా అభిమానులు చాలామంది దాన్ని తమ డీపీగా పెట్టుకున్నారు.