‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌పై.. రామ్‌చరణ్ క్లారిటీ!

| Edited By: Anil kumar poka

Jan 08, 2020 | 9:24 AM

రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల లేట్ అవుతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాటిపై స్పందించిన హీరో రామ్ చరణ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వారితో పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం జూలై 30న విడుదల అవుతుందని.. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు […]

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్‌పై.. రామ్‌చరణ్ క్లారిటీ!
Follow us on

రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల లేట్ అవుతుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాటిపై స్పందించిన హీరో రామ్ చరణ్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వారితో పంచుకున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం జూలై 30న విడుదల అవుతుందని.. అంతేకాకుండా ఇప్పటికే దాదాపు 70 షూటింగ్ పూర్తయ్యిందని స్పష్టం చేశారు. అయితే సినిమా డేట్‌పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. మిగిలిన విషయాల గురించి మాత్రం ఏమి చెప్పలేదు. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీని హాలీవుడ్‌లో కూడా విడుదల చేయడానికి రాజమౌళీ సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. కాగా, రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’తో పాటుగా చిరంజీవి-కొరటాల శివ మూవీకి  నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు.