నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. రజినీ అభిమానులు ఆసుపత్రికి రావొద్దంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై తాజాగా అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు.

నిలకడగా రజినీకాంత్ ఆరోగ్యం.. రజినీ అభిమానులు ఆసుపత్రికి రావొద్దంటూ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి

Updated on: Dec 25, 2020 | 7:13 PM

Rajini latest health bulletin: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యంపై తాజాగా అపోలో ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. రజినీకాంత్ ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. రక్తపోటును నియంత్రించడానికి మందులు అవసరాన్ని బట్టి వాడతున్నామని, రజినీ ఈరోజు (శుక్రవారం) రాత్రి కూడా ఆసుపత్రిలోనే ఉంటారని వివరించారు.
ఇక రజినీ ఆరోగ్యం నిలకడగా ఉందని.. కానీ మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపారు. రజనీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రజినీని చూడడానికి ఎవరూ రావొద్దని, ఆయనను కలవడానికి ప్రస్తుతం ఎవరికీ అనుమతి లేదని సూచించారు. ఇక రజినీ కుమార్తె ప్రస్తుతం ఆయనతోనే ఉన్నారు. రజినీ అభిమానులు ఆసుపత్రికి రావొద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చెన్నై నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి రజినీ వ్యక్తిగత వైద్యులు చేరుకున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us