అగస్టా కుంభకోణం కేసులో సక్సేనాకు బెయిల్

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:18 PM

దిల్లీ: అగస్టా వెస్ట్‌లాంట్‌ కుంభకోణంలో అరెస్టయిన రాజీవ్‌ సక్సేనాను దిల్లీ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తులు హామీ ఇవ్వాలని కోరారు. అలాగే సాక్షాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయోద్దని హెచ్చరించారు. కావాల్సినప్పుడు విచారణకు హాజరు కావాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. గత నెల రాజీవ్‌ను దుబాయ్‌ పోలీసులు భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. […]

అగస్టా కుంభకోణం కేసులో సక్సేనాకు బెయిల్
Follow us on

దిల్లీ: అగస్టా వెస్ట్‌లాంట్‌ కుంభకోణంలో అరెస్టయిన రాజీవ్‌ సక్సేనాను దిల్లీ కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్‌ కుమార్‌ రూ.5లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరు వ్యక్తులు హామీ ఇవ్వాలని కోరారు. అలాగే సాక్షాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయోద్దని హెచ్చరించారు. కావాల్సినప్పుడు విచారణకు హాజరు కావాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. గత నెల రాజీవ్‌ను దుబాయ్‌ పోలీసులు భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనతో పాటు మరో నిందితుడు దీపక్‌ తల్వార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్టు చేశారు. అగస్టా హెలికాప్టర్ల కొనుగోళ్లలో సక్సేనాకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంలో రాజీవ్‌కు అనేకసార్లు ఈడీ సమన్లు సైతం పంపింది. గతేడాది ఆయన భార్య శివానీ సక్సేనాను కూడా అరెస్టు చేశారు. ఆమె ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.