మరో మూడు రోజుల పాటు వర్షాలు..

|

Oct 05, 2020 | 5:17 PM

తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోన సీమ, రాయలసీమల్లో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి.

మరో మూడు రోజుల పాటు వర్షాలు..
Follow us on

Telangana Rains : తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోన సీమ, రాయలసీమల్లో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. తెలంగాణలో గత నెలలో కురిసిన వర్షాలతో గొలుసుకట్టు చెరువులు మంత్తడి దూకుతున్నాయి. రాష్ట్రంలోని గోదావరి నది అవసరానికిమించి ప్రవహిస్తోంది.

అయితే తాజాగా వాతావరణ శాఖ అధికారులు మరో రిపోర్టును ప్రకటించారు. తెలంగాణకు మరో వానగండం పొంచి ఉందని పేర్కొన్నారు. వాయవ్య బంగా‌ళా‌ఖాతంతోపాటు ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీ‌డనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

దీనికి అను‌బం‌ధంగా 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌న ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తు‌న్నది.ఉత్తర మధ్య మహారాష్ట్ర మీదుగా  1.6 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వద్ద ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ఏర్పడిందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలిపారు. ఈ ప్రభా‌వంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడ‌క్కడ ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన ఓ మోస్తరు నుంచి తేలి‌క‌పాటి వర్షాలు కురు‌స్తా‌యని వెల్లడించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.