Rain In Telangana: రెండు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన.. మరింత పెరగనున్న చలి తీవ్రత..

|

Jan 06, 2021 | 6:49 AM

Rain In Telangana: ఇప్పటికే చలి తీవ్రతో ఇబ్బంది పడుతోన్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ వర్షాలు పడనున్నట్లు తెలిపింది...

Rain In Telangana: రెండు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన.. మరింత పెరగనున్న చలి తీవ్రత..
Andhra Pradesh Rain Alert
Follow us on

Rain In Telangana: ఇప్పటికే చలి తీవ్రతతో ఇబ్బంది పడుతోన్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది.
ఇక ఇప్పటికే రాష్ట్రంలో చలి రోజురోజుకీ పెరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఆగ్నేయం, దక్షిణ దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఈ చలి తీవ్రత ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో కొన్ని చోట్ల తెల్లవారుజామున పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇక మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 10.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా పిట్లంలో 11.7 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Also Read: ఫేక్ ఇన్సూరెన్స్‌ ముఠాను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. ‘ఇన్‌స్టాంట్‌’ పదంలో మోసం ఉందంటున్న సీపీ సజ్జనార్