తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు.. అధికారుల హెచ్చరికలు

| Edited By:

Oct 07, 2019 | 12:31 PM

తెలుగురాష్ట్రాల్లో సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలకు అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు తాజా పరిస్థితులపై ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్య ఒడిషా ప్రాంతంలో ఉరితల ఆవర్తనం కొనసాగుతుందని, అలాగే దక్షిణ ఛత్తీస్‌గడ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, మధ్య కర్ణాటకల […]

తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు..  అధికారుల హెచ్చరికలు
Rain Alert
Follow us on

తెలుగురాష్ట్రాల్లో సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలకు అవకాశాలున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్ర అధికారులు తాజా పరిస్థితులపై ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్య ఒడిషా ప్రాంతంలో ఉరితల ఆవర్తనం కొనసాగుతుందని, అలాగే దక్షిణ ఛత్తీస్‌గడ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కి.మీ ల ఎత్తులో మరో ఉపరిత ధ్రోణి కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీనికారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వారు పేర్కొన్నారు.