తెలంగాణాలో వర్షాలు దంచుతున్నాయి.. కానీ..

| Edited By:

Oct 07, 2019 | 11:25 AM

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ఆగష్టు నుంచి అన్ని ప్రాంతాల్లో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, కుంటలు అన్ని నిండిపోయాయి. ఈ వర్షాలకు ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇక ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల […]

తెలంగాణాలో వర్షాలు దంచుతున్నాయి.. కానీ..
Follow us on

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్నాయి. ఆగష్టు నుంచి అన్ని ప్రాంతాల్లో ముందెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వానలు పడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, కుంటలు అన్ని నిండిపోయాయి. ఈ వర్షాలకు ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇక ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.

కాగా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రానికి బై బై చెప్పనున్నాయి. దాదాపు నెల రోజుల ఆలస్యంగా ఇవి వెనక్కి మళ్లుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇంత ఆలస్యంగా వెళ్లడం ఇదే ప్రథమమని వారు చెప్పుకొచ్చారు. అయితే ఇంత రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డప్పటికీ.. తెలంగాణలోని ప్రాజెక్ట్‌లను మాత్రం నింపలేకపోయాయి. సింగూరు, నిజాంసాగర్‌, మంజీర జలాశయాల్లో పావు శాతం కూడా నీరు చేరలేదు. దీంతో ఆయా ప్రాంతాలు కరువు పరిస్థితులను తలపిస్తున్నాయి.