ఈ నెల 15 నుంచి రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు, కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్ తీసుకురాకపోతే ఇలా చేయాలి

|

Dec 12, 2020 | 9:13 PM

రైల్వేశాఖలో 1.4 లక్షల ఉద్యోగాలకు కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ నెల 15 నుంచి రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు, కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్ తీసుకురాకపోతే ఇలా చేయాలి
Indian Railways
Follow us on

రైల్వేశాఖలో 1.4 లక్షల ఉద్యోగాలకు కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మొదటి విడత పరీక్షలు ఈనెల 15 నుంచి 18 వరకు, రెండవ దశ పరీక్షలు.. డిసెంబర్‌ 28 నుంచి 2021 మార్చి వరకు జరుగుతాయని రైల్వేశాఖ తెలిపింది. ఈ  జాబ్స్ కోసం అప్లై చేసుకున్న 2.44 కోట్ల మందికి తక్కువ దూరంలోనే ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కరోనా నిబంధనలు పాటిస్తూ రవాణా సౌకర్యం ఉంటుందని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని అధికారులు తెలిపారు.

ఎగ్జామ్ రాసే అభ్యర్థులు కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్ తీసుకురాలేని పక్షంలో డిక్లరేషన్‌లో పరీక్ష రాసేందుకు సిద్ధమని సంతకం చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద అభ్యర్థి శరీర ఉష్టోగ్రత సాధారణం కంటే ఎక్కువ ఉంటే ఆ అభ్యర్థితో మరో తేదీలో పరీక్ష రాయిస్తామని తెలిపారు. పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు హాల్‌టికెట్‌ని.. ఆయా ఆర్​ఆర్​బీ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read :

ఆందోళన చేస్తోన్న అన్నదాతల కోసం మొన్న పెద్ద రోటీ యంత్రాలు..ఇప్పుడు ఫుట్ మసాజర్లు, తాత్కాలిక జిమ్‌లు

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫినాలేకు అతిథి మహేశ్ కాదట..’మాస్ కా బాప్’ రాబోతున్నారట !

నెల్లూరు జిల్లా వెలుగొట్లపల్లిలో పొలంలో నాట్లు వేస్తున్న ఆరుగురు కూలీలకు అస్వస్థత..ఒకరు మృతి

మహిళకు పురిటి నొప్పులు, అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేదు : వాలంటీర్లు హీరోలు అయిన వేళ