బాబోయ్ ఏప్రిల్ 26.. రాహుల్ పరేషాన్..!

| Edited By:

Apr 26, 2019 | 5:13 PM

2018 ఏప్రిల్ 26.. సరిగ్గా ఇదే రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎలాంటి ప్రమాదం లేకపోవడండో సురక్షితంగా బయటపడ్డారు. కరెక్ట్‌గా ఈ రోజుకు ఏడాది గడిచింది.. 2019 ఏప్రిల్ 26న.. మళ్లీ రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గతంలో మాదిరే మరోసారి ఆయన సురక్షితంగా బయట పడ్డారు. కాగా.. మళ్లీ ఇదే రోజున అదే పరిస్థితి ఎదురవడంతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఘటనపై యథాప్రకారం […]

బాబోయ్ ఏప్రిల్ 26.. రాహుల్ పరేషాన్..!
Follow us on

2018 ఏప్రిల్ 26.. సరిగ్గా ఇదే రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎలాంటి ప్రమాదం లేకపోవడండో సురక్షితంగా బయటపడ్డారు. కరెక్ట్‌గా ఈ రోజుకు ఏడాది గడిచింది.. 2019 ఏప్రిల్ 26న.. మళ్లీ రాహుల్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. గతంలో మాదిరే మరోసారి ఆయన సురక్షితంగా బయట పడ్డారు. కాగా.. మళ్లీ ఇదే రోజున అదే పరిస్థితి ఎదురవడంతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా ఘటనపై యథాప్రకారం డీజీసీఏ విచారణకు ఆదేశించింది.

బీహార్‌లోని సమస్తిపుర్‌లో ఎన్నికల సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా రాహుల్ గాంధీ విమాన ఇంజిన్‌కు సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ఈ విమానాన్ని ఢిల్లీ మళ్లించారు. ఈ విషయాన్ని రాహుల్ తన ట్విట్టర్‌ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కాగా.. 2018లో కూడా ఎన్నికల ప్రచారానికి కర్ణాటకలోని హుబ్లీ వెళ్తుండగా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ రెండు విమాన ప్రయాణాల్లో రాహుల్‌కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.