Facebook Cheating: ఢిల్లీలో కూర్చోని దేశంలోని యువతీయువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.. కట్ చేస్తే

|

Jan 09, 2021 | 8:00 PM

వారంతా ఇంటర్నేషనల్ కేటగాళ్లు. దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేశారు. ఒక ఇంట్లో కూర్చోని దేశంలోని చాలామంది యువతీ, యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు.

Facebook Cheating: ఢిల్లీలో కూర్చోని దేశంలోని యువతీయువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు.. కట్ చేస్తే
Follow us on

Facebook Cheating: వారంతా ఇంటర్నేషనల్ కేటగాళ్లు. దేశ రాజధాని ఢిల్లీలో మకాం వేశారు. ఒక ఇంట్లో కూర్చోని దేశంలోని చాలామంది యువతీ, యువకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. విచ్చలవిడిగా సైబర్ నేరాలకు పాల్పడుతూ పోలీసులకు టార్గెట్ విసురుతున్నారు. తాజాగా ఈ నైజీరియన్ క్రిమినల్ ముఠాను రాచకొండ సైబర్‌ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన సూత్రధారి గాడ్స్‌టైం టీమ్‌కు దిశానిర్దేశం చేస్తాడు.  అబ్బాయిలకు అమ్మాయిల ఫోటోలు,  అబ్బాయిలకు అమ్మాయిల ఫొటోలు ప్రొఫైల్‌గా పెట్టి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపుతారు. వాళ్లు రిక్వెస్ట్ యాక్సెప్ట్‌ చేశాక కొద్దిరోజులు నమ్మకంగా చాట్ చేస్తారు. తాము ఫారెన్‌లో ఒంటరిగా నివసిస్తున్నానని, తన దగ్గర చాలా డబ్బు ఉందని సినిమా స్టైల్లో కథ చెబుతారు. నమ్మి మాయలో పడినవారికి తరచూ గిఫ్టులు పంపిస్తూ ఆకట్టుకుంటాడు. ఆపై అత్యవసరాల పేరుతో వారికి ఫోన్లు చేస్తూ.. డబ్బు వసూళ్లకు పాల్పడతారు. కంప్లైంటులు అందండంతో రాచకొండ పోలీసలు రంగంలోకి దిగారు. విచారణలో ఈ కేటుగాళ్లు డింగ్‌టోన్‌ యాప్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 2020, నవంబరు 28న రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని మీర్‌పేట పీఎస్‌లో ఓ బాధితుడు ఇచ్చిన ఇచ్చిన ఓ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఢిల్లీలో ఉన్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. అమాయలకుల నుంచి కొట్టేసిన నగదుతో వీరంతా ఎంజాయ్ చేస్తున్న వీడియోలు చూసి పోలీసులే కంగుతిన్నారు.

Also Read: 

Nellore Tragedy: లవ్ మ్యారేజ్ చేసుకున్న 2 నెలలకు భర్త మరణం.. తాజాగా భార్య మృతి, అంతా మిస్టరీ !