Raashi Khanna : కెరియర్ పై క్లారిటీతో ఉన్న రాశిఖన్నా.. మంచిరోజులొస్తాయని నమ్మకంతో ఉన్నానంటున్న ముద్దుగుమ్మ..

|

Jan 22, 2021 | 5:39 AM

ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా నటించింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

Raashi Khanna : కెరియర్ పై క్లారిటీతో ఉన్న రాశిఖన్నా.. మంచిరోజులొస్తాయని నమ్మకంతో ఉన్నానంటున్న ముద్దుగుమ్మ..
Follow us on

Raashi Khanna : ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా నటించింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో బాగా బిజీగాఉంది ఈ పంజాబీ సుందరి  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాశి మాట్లాడుతూ ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ‘ గ్లామర్‌ హీరోయిన్ అనే ఇమేజ్‌లో బందీ అయిపోవడం తనకు ఇష్టం ఉండదని, తన  టాలెంట్ ను గుర్తించారు కాబట్టే తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని తెలిపింది రాశి.

“భవిష్యత్తులో నటన పరంగా మరింత పరిణితి సాధిస్తాననే నమ్మకం ఉంది. నా కలలకు ఎప్పుడు లిమిట్స్ పెట్టుకోలేదు అలాగే నా ప్రతిభాసామర్థ్యాల మీద నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోలేదు అంటూ చెప్పుకొచ్చింది ఈ చిన్నది.  ఇక   ఓటీటీ వేదికల వల్ల భాషాపరమైన హద్దులు చెరిగిపోతున్నాయి. టాలెంట్ ఎక్కడున్నా ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. నటిగా నాలోని ప్రతిభను మెరుగు పరుచుకొని, నటిగా నన్నునేను రుజువు చేసుకునే మంచిరోజులొస్తాయని నమ్మకంతో ఉన్నా” అంటూ  ఈ పంజాబీ బ్యూటీ చెప్పుకొచ్చింది. మరి అమ్మడి ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.