కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు

|

Oct 17, 2020 | 12:53 PM

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. కొంపల్లి ఉమామహేశ్వరి కాలనీ పాక్స్ సాగర్ బ్యాక్ వాటర్తో మునిగింది. సుభాష్ నగర్‌ ఫాక్స్ సాగర్‌ దిగువన ఉన్న ఉమా మహేశ్వర కాలనీలో సుమారు ‌650 ఇళ్ళు‌ నీట మునిగాయి. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ‌నిరాశ్రయులయ్యారు. మురికినీరు, బురదతో నానా కష్టాలు పడుతున్నారు. ఈ ప్రాంతం నుండి తమను తాము రక్షించుకోవడానికి‌ ఇళ్ళు‌ ఖాళీ చేసి వెళ్ళి పోతున్నారు. […]

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజల కష్టాలు
Follow us on

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. కొంపల్లి ఉమామహేశ్వరి కాలనీ పాక్స్ సాగర్ బ్యాక్ వాటర్తో మునిగింది. సుభాష్ నగర్‌ ఫాక్స్ సాగర్‌ దిగువన ఉన్న ఉమా మహేశ్వర కాలనీలో సుమారు ‌650 ఇళ్ళు‌ నీట మునిగాయి. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు ‌నిరాశ్రయులయ్యారు. మురికినీరు, బురదతో నానా కష్టాలు పడుతున్నారు. ఈ ప్రాంతం నుండి తమను తాము రక్షించుకోవడానికి‌ ఇళ్ళు‌ ఖాళీ చేసి వెళ్ళి పోతున్నారు. గత‌ పదహేన్లు గా ఇక్కడ ‌ఉంటున్నామని, ఎప్పుడు వర్షం పడినా ఇదే తరహా నరకం అనుభవిస్తున్నామని స్ధానికులు వాపోతున్నారు. అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఫాక్స్ సాగర్ నుండి కాలనీల్లోకి వరద నీరు రావడంతో దిక్కు తోచని స్థితిలో ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని‌ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి దగ్గరలోని కమ్యూనిటీ హాల్, ఫంక్షన్ హాల్‌లో తల దాచుకుంటున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్ నగర్‌లో ఉన్న ఫాక్స్ సాగర్ పూర్తి స్థాయిలో నిండటంతో పలు కాలనీలు ముంపుకు గురయ్యాయి.