ఒక్క బిజినెస్ కార్డుతో.. ఆ పనిమనిషికి వెల్లువెత్తిన ‘ఉద్యోగాలు’

|

Nov 09, 2019 | 4:56 PM

గీతా కాలే.. పూణేకు చెందిన ఈమె పేదింటి కుటుంబం నుంచి వచ్చింది.. పొట్టకూటి కోసం రోజూ పది ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన జీవిత రథచక్రాలను నడిపిస్తోంది. అయితే అనుకోకుండా ఆమెకు ఉద్యోగం పోయింది.. పని పోయిందన్న బెంగ పెట్టుకోవడం మాట అటుంచితే.. ఊహించని విధంగా ఆమెకు వెల్లువెత్తిన అవకాశాలు చూసి.. దేన్నీ సెలెక్ట్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ధనశ్రీ షిండే అనే మహిళ గీతా కాలే కోసం తయారు చేసిన బిజినెస్ కార్డు వల్ల […]

ఒక్క బిజినెస్ కార్డుతో.. ఆ పనిమనిషికి వెల్లువెత్తిన ఉద్యోగాలు
Follow us on

గీతా కాలే.. పూణేకు చెందిన ఈమె పేదింటి కుటుంబం నుంచి వచ్చింది.. పొట్టకూటి కోసం రోజూ పది ఇళ్లలో పాచిపని చేసుకుంటూ తన జీవిత రథచక్రాలను నడిపిస్తోంది. అయితే అనుకోకుండా ఆమెకు ఉద్యోగం పోయింది.. పని పోయిందన్న బెంగ పెట్టుకోవడం మాట అటుంచితే.. ఊహించని విధంగా ఆమెకు వెల్లువెత్తిన అవకాశాలు చూసి.. దేన్నీ సెలెక్ట్ చేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ధనశ్రీ షిండే అనే మహిళ గీతా కాలే కోసం తయారు చేసిన బిజినెస్ కార్డు వల్ల ఇదంతా సాధ్యమైంది. ఇక వీరిద్దరి ఇన్‌క్రెడిబుల్ స్టోరీని అస్మితా జవదేకర్ తన ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అసలు ఇదెలా జరిగిందంటే…

ధనశ్రీ షిండే ఒకానొక సందర్భంలో అస్మితా ఇంటికి వచ్చి.. తన ఇంట్లో ఒక రోజు పని చేయడానికి పని మనిషిని చూడమని కోరింది. అస్మితా వెంటనే గీతా కాలేకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. ఆమె ధనశ్రీ దగ్గర పని చేయడానికి ఒప్పుకుంది. ఇక మర్నాడు ధనశ్రీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దిగులుగా ఉన్నా గీతాను చూసి.. ‘ఏం జరిగిందంటూ అడిగితే’.. తాను ఉద్యోగం కోల్పోయానని.. అందువల్ల నెలకు వచ్చే ఆదాయం పోయిందంటూ గీతా తన బాధను వ్యక్తం చేసింది.

బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్‌లో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్న ధనశ్రీ.. గీతాకు ఎలాగైనా సహాయపడాలని నిర్ణయించుకుంది. దానితో ఆమెకు తట్టిన మెరుపులాంటి ఆలోచనతో గీతా పేరుతో ఓ బిజినెస్ కార్డును రూపొందించింది. ‘‘గీతా కాలే, ఘర్‌ కామ్‌ మౌషీ ఇన్‌ బౌదన్’’ అని పేర్కొంటూ వంద కార్డులను ముద్రించడమే కాకుండా వాటన్నింటిని తన సొసైటీలో ఉండే ప్రతి ఇంటికి చేర్చింది. మరోవైపు ఓ కార్డును సోషల్ మీడియాలో సైతం షేర్ చేయగా.. అది కొద్దిసేపటికే సంచలనం అయింది.