కోవిడ్ కేర్ సెంటర్‌లో బాత్రూంను శుభ్రం చేసిన మంత్రి

|

Aug 29, 2020 | 9:56 PM

పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పెద్దమనస్సు చాటుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లో బాత్రూం లను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. పుదుచ్చేరి లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తం గా 13 వేల 556 మందికి కరోనా నిర్ధారణ కాగా,211 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు...

కోవిడ్ కేర్ సెంటర్‌లో బాత్రూంను శుభ్రం చేసిన మంత్రి
Follow us on

పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు పెద్దమనస్సు చాటుకున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లో బాత్రూం లను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. పుదుచ్చేరి లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తం గా 13 వేల 556 మందికి కరోనా నిర్ధారణ కాగా,211 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.

పుదుచ్చేరి లోని ఇందిరాగాంధీ మెడికల్ హాస్పిటల్ కరోనా బాధితులను ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మల్లాడి కృష్ణారావు పరామర్శించారు. హాస్పిటల్‌లో వసతుల గురించి ఆరా తీశారు. హాస్పిటల్ లో పలు చోట్ల బాత్రూంలు శుభ్రంగా లేవని , సరైన సమయంలో భోజనం అందడం లేదని బాధితులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆయనే స్వయంగా రంగం లోకి దిగారు.

బాధితుల ఫిర్యాదు మేరకు అధికారులను అప్రమత్తం చేసి, స్వయం గా కోవిడ్ కేర్ సెంటర్ లో బాత్రూం లను శుభ్రం చేసి బాధితులకు భరోసా ఇచ్చారు.