విజయా డెయిరీని చెడగొట్టారు : సీఎం కేసీఆర్

| Edited By:

Sep 19, 2019 | 2:51 AM

విజయ డెయిరీని కొందరు దుర్మార్గులు చెడగొట్టారన్నాని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది గతంలో కావాలనే విజయ డెయిరీని సర్వనాశనం చేశారంటూ విమర్శించారు. మార్కెట్‌లో ప్రతి వస్తువు కల్తీ మయంగా మారిపోయాయని, దీన్ని నివారించవలసిన అవసరంముందన్నారు. విజయ కంపెనీ నుంచి వచ్చే నెయ్యికి ముంబైలో ఇప్పటికీ ఆదరణ ఉందన్నారు సీఎం. రాష్ట్రంలో రేషన్ డీలర్ల వ్యవస్థను పటిష్ట పరుస్తామని, అవసరమైతే వారికి ఇచ్చే కమిషన్ పెంచే […]

విజయా డెయిరీని చెడగొట్టారు : సీఎం కేసీఆర్
Follow us on

విజయ డెయిరీని కొందరు దుర్మార్గులు చెడగొట్టారన్నాని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది గతంలో కావాలనే విజయ డెయిరీని సర్వనాశనం చేశారంటూ విమర్శించారు. మార్కెట్‌లో ప్రతి వస్తువు కల్తీ మయంగా మారిపోయాయని, దీన్ని నివారించవలసిన అవసరంముందన్నారు. విజయ కంపెనీ నుంచి వచ్చే నెయ్యికి ముంబైలో ఇప్పటికీ ఆదరణ ఉందన్నారు సీఎం.

రాష్ట్రంలో రేషన్ డీలర్ల వ్యవస్థను పటిష్ట పరుస్తామని, అవసరమైతే వారికి ఇచ్చే కమిషన్ పెంచే ఆలోచన కూడా ఉందన్నారు. అక్టోబర్ 15 తర్వాత వివిధ జిల్లాల వారీగా మంత్రులు ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చిస్తామన్నారు.  రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్ధ బాగానే ఉందని, అకున్ సబర్వాల్ బాగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కొంతమంది పాలు కూడా కల్తీ చేయడం బాధాకరమైన విషయమని పీడీఎస్ సిస్టమ్ బలోపేతం చేయడంతోనే కల్తీలేని వస్తువులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలమని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలను క్రీయాశీలకంగా మార్చే ప్రక్రియలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, వీటిద్వారా నాణ్యమైన వస్తువులు మార్కెట్‌ లభ్యమవుతాయన్నారు.