బాలయ్య డబుల్ రెమ్యునరేషన్‌పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

| Edited By:

Oct 31, 2019 | 5:03 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో.. 105వ సినిమా ‘రూలర్’ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి బాలకృష్ణ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చేసిన సినిమాలకంటే.. డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై నిర్మాత సీ కళ్యాణ్ స్పందించారు. బాలకృష్ణ.. ఎప్పుడూ.. రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదని తెలిపారు. ఆయన ఎప్పుడూ.. పాత్రపైనే దష్టి పెడతారని.. కొత్తగా ఆలోచిస్తారని సీ కళ్యాణ్ తెలిపారు. అసలు […]

బాలయ్య డబుల్ రెమ్యునరేషన్‌పై నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!
Follow us on

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో.. 105వ సినిమా ‘రూలర్’ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి బాలకృష్ణ భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో చేసిన సినిమాలకంటే.. డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై నిర్మాత సీ కళ్యాణ్ స్పందించారు.

బాలకృష్ణ.. ఎప్పుడూ.. రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదని తెలిపారు. ఆయన ఎప్పుడూ.. పాత్రపైనే దష్టి పెడతారని.. కొత్తగా ఆలోచిస్తారని సీ కళ్యాణ్ తెలిపారు. అసలు ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ.. మా మధ్య డిస్కష్షన్ రాలేదని స్పష్టం చేశారు. ఆయన డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న వార్తల్లో అస్సలు నిజం లేదని కొట్టి పారేశారు.

బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో.. ‘రూలర్’ చిత్రం తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అందులోనూ.. ఈ చిత్రంలో.. బాలయ్య పాత్ర చాలా ఆసక్తిగా ఉంది. ముందు చాలా స్లిమ్‌గా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించగా.. ఆ తరువాత.. పోలీస్ పాత్రలో కనిపించి.. అభిమానులను అలరించారు.