ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

|

Sep 07, 2020 | 4:18 PM

ఏపీ-తెలంగాణ-ఏపీ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. అన్‌లాక్‌ 4.0 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు ఇవ్వడంతో ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కాయి.

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..
Follow us on

ఏపీ-తెలంగాణ-ఏపీ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. అన్‌లాక్‌ 4.0 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు ఇవ్వడంతో ప్రైవేట్ బస్సులు రోడ్డెక్కాయి. ఇప్పటివరకు ట్రైన్లు, ప్రత్యేక వాహనాలపై తమ స్వస్థలాలకు వెళ్లిన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి.(Private Bus Services)

ఏపీ రవాణాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆపరేటర్లు హైదరాబాద్‌కు బస్సులు తిప్పుతున్నారు. ఏపీలోని ప్రధాన ప్రాంతాలైన వైజాగ్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, అనంతపురం ప్రాంతాల నుంచి ఈ సర్వీసులు నడవనున్నాయి. శనివారం నుంచి ఆన్‌లైన్‌ రిజర్వేషన్ విధానాన్ని కూడా మొదలుపెట్టారు. ప్రయాణీకుల రద్దీ బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి.

కాగా, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నాయి. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఐదు నెలలుగా ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసుల విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

Also Read: అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్..