ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: తమ్మినేని సీతారాం

| Edited By:

Jul 12, 2020 | 6:09 AM

కరోనా సంక్షోభ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తుందని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు.

ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: తమ్మినేని సీతారాం
Follow us on

Priority to The Agricultural Sector: కరోనా సంక్షోభ సమయంలో కూడా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తుందని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయని స్పీకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యసహాయం అందేలా అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. దీనిలో భాగంగా 104,108 అంబులెన్స్‌ వాహనాలను అందుబాటులో ఉంచారని వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వివిధ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించిందని స్పీకర్‌ వెల్లడించారు.

Also Read: అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..