రైళ్లలో వారికే తొలి పాధాన్యం..: హైకోర్టు

| Edited By:

Jul 31, 2020 | 12:04 AM

రైళ్లలో గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కింది బెర్త్‌లు ఇవ్వాలని మధ్య ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరికి ప్రాధాన్యత ఇచ్చేలా రిజర్వేషన్ వ్యవస్థను మార్చాలని సూచించింది.

రైళ్లలో వారికే తొలి పాధాన్యం..: హైకోర్టు
Follow us on

రైళ్లలో గర్భిణీ స్త్రీలు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కింది బెర్త్‌లు ఇవ్వాలని మధ్య ప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరికి ప్రాధాన్యత ఇచ్చేలా రిజర్వేషన్ వ్యవస్థను మార్చాలని సూచించింది. ‘‘లోవర్ బెర్తుల కేటాయింపులో వీవీఐపీలే (అత్యంత ముఖ్యమైన వ్యక్తులు) తొలి ప్రాధాన్యత పొందే వ్యవస్థ సహేతుకం కాదు..’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ అతుల్ శ్రీధరన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

కోర్టు ఈ కేసును సుమోటోగా (స్వయంగా) చేపట్టింది. న్యాయవాది ఆదిత్య సంఘి, కోర్టుకు సహాయం చేయడానికి పిటిషనర్‌గా హాజరయ్యారు. గర్భిణీ స్త్రీలకు లోవర్ బెర్తుల రిజర్వేషన్ ప్రక్రియలో అధిక ప్రాధాన్యత పొందాలని సంఘీ కోర్టుకు తెలిపారు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం.. గర్భిణీ మహిళలు తమ పరిస్థిని బట్టి మధ్య లేదా పై బెర్తుల్లోకి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందనీ, కాబట్టి వారికే ముందుగా కింది బెర్తులు కేటాయించాలని ఆదేశించింది.

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!