డ్రోన్లను ఇలా కూడా వాడొచ్చా..?

|

Oct 17, 2020 | 6:14 PM

ఆలోచన ఉంటే సంకల్పం కచ్చితంగా నెరవేరుతుందని మరోసారి రుజువైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను డ్రోన్ సాయంతో అధికారులు పునరుద్ధరించారు.

డ్రోన్లను ఇలా కూడా వాడొచ్చా..?
Follow us on

ఆలోచన ఉంటే సంకల్పం కచ్చితంగా నెరవేరుతుందని మరోసారి రుజువైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను డ్రోన్ సాయంతో అధికారులు పునరుద్ధరించారు. తూర్పు గోదావరి జిల్లాలో గత కొద్దిరోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి, కృష్ణా నదులు పొంగిపోర్లుతున్నాయి. దీంతో లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ర్పు గోదావరి, విశాఖ జిల్లాల సరిహద్దుల్లో ప్రవహించే తాండవ నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో తుని మండలంలోని పలు గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీ వరదల కారణంగా ఎన్‌ఎస్ వెంకటనగరం గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు డ్రోన్‌తో వైర్లను ఆ గట్టు నుంచి ఈ గట్టుకు తీసుకొచ్చి గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. మూడు చీకట్లో కాలం వెళ్లదీసిన గ్రామస్తులు అధికారుల చర్యలపట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.