పోస్టుమ్యాన్‌ నిర్వాకంతో పోయిన జాబ్

|

Jun 26, 2020 | 6:40 PM

పోస్టుమ్యాన్‌ నిర్వాకం ఓ నిరుద్యోగి పాలిట శాపం మారింది. తనకు వచ్చిన అపాయింట్ మెంట్ లెటర్ ను వేరొకి ఇవ్వడంతో కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగం రాకుండా పోయింది. ఇదే విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది.

పోస్టుమ్యాన్‌ నిర్వాకంతో పోయిన జాబ్
Follow us on

పోస్టుమ్యాన్‌ నిర్వాకం ఓ నిరుద్యోగి పాలిట శాపం మారింది. తనకు రావల్సిన అపాయింట్ మెంట్ లెటర్ ను వేరొకరికి ఇవ్వడంతో కోటి ఆశలు పెట్టుకున్న ఉద్యోగం రాకుండా పోయింది. ఇదే విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది.
వరంగల్ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి కోమల 2017లో స్టాఫ్‌నర్సు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో కోమలను ఎంపిక చేస్తూ జిల్లా మెడికల్ ఆఫీసర్ విధుల్లో చేరాలంటూ అపాయింట్ మెంట్ లెటర్ పోస్ట్ చేశారు. అయితే, గ్రామ పోస్టుమ్యాన్‌ పొరపాటు వల్ల కోమల బాబ్ లో చేరకుండానే పోయింది. సదరు పోస్టుమ్యాన్‌ బొమ్మకంటి కోమలకు బదులుగా నద్దునూరి కోమలకు ఆ లెటర్ ను అందించాడు. అయితే ఉద్యోగం నియామకం పత్రం కోసం కోమల దరఖాస్తు చేసినప్పటి నుంచి ఎదురుచూస్తూనే ఉంది. అపాయిమెంట్ లెటర్ వచ్చిన విషయం తెలియక ఆమె విధుల్లో చేరలేకపోయింది. 6 నెలల తరువాత ఉద్యోగం రద్దు చేస్తూ మరో లేఖను డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి పంపించారు. ఈ లేఖ బాధితురాలికి అందగానే సంబంధిత కార్యాలయం చుట్టూ తిరిగి అధికారులను ప్రాధేయపడింది. కానీ పోస్టుమ్యాన్‌ వల్ల జరిగిన పొరపాటుకు తామేమి చేయలేమని తేల్చి చెప్పారు. ఇదే విషయంపై పోస్టుమ్యాన్‌ను సంజాయిషీ కోరగా.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు చొరవజూపి తనకు న్యాయం చేయాలని కోరింది. ఇదిలావుంటే, తాను కావాలని చేయలేదని, ఒకే ఇంటి పేరుతో ఇద్దరు ఉండటం, తండ్రి పేరు ఒకటే కావడంతో ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు పోస్టుమ్యాన్‌ రవీందర్‌.