వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘బుట్టబొమ్మ’.. మూడు భాషల్లో ఐదు సినిమాలతో బిజీగా మారిన పూజా.

| Edited By: Pardhasaradhi Peri

Dec 19, 2020 | 7:10 PM

‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారింది. పూజా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది.

వరుస సినిమాలతో దూసుకెళుతోన్న ‘బుట్టబొమ్మ’.. మూడు భాషల్లో ఐదు సినిమాలతో బిజీగా మారిన పూజా.
Follow us on

pooja hegde busy with new movies: ‘ఒక లైలా కోసం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార పూజా హెగ్డే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిన్నది టాలీవుడ్ లక్కీ గర్ల్‌గా మారింది. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది కొద్ది కాలంలోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. అనంతరం బడా హీరోల సరసన నటిస్తూ వస్తోన్న ఈ చిన్నది తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ తనదైన ముద్ర వేసింది.
పూజా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. నిర్మాతలకు కూడా ఇప్పుడు పూజా హాట్ ఫేవరేట్‌గా మారింది. ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో అక్కినేని అఖిల్‌తో రోమాన్స్ చేస్తోంది. ఇక కేవలం తెలుగుకే పరిమితం కాకుండా బాలీవుడ్‌లో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసిందీ చిన్నది. దీంతో పాటు రన్‌వీర్ సింగ్‌, రోహిత్‌లతో ‘క్రికస్’ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు తమిళంలోనూ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుంది. ఇలా పూజా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేసారి ఏకంగా ఐదు సినిమాలతో బిజీగా మారింది.