చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ విషయం తప్ప పెద్దగా రాజకీయాలు వినిపించని తెలంగాణలోనూ ఉన్నట్టుండి పొలిటికల్ హీట్ మొదలైంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో మతలబు ఉందని ఓ వైపు బిజెపి.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు మొదలుపెట్టాయి.

చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:49 PM

నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ విషయం తప్ప పెద్దగా రాజకీయాలు వినిపించని తెలంగాణలోనూ ఉన్నట్టుండి పొలిటికల్ హీట్ మొదలైంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో మతలబు ఉందని ఓ వైపు బిజెపి.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు మొదలుపెట్టాయి. ఈ రెండు పార్టీలపై ఎదురు దాడికి దిగిన అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రచార ఆర్భాటంపై సెటైర్లు మొదలుపెట్టారు.

తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ సిటీలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరిట ఆధునిక కరోనా వైరస్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ ఆస్పత్రికి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఎంపీలాడ్స్‌పై వివాదం రాజుకుంది. ఓవైపు ఎంపీలాడ్స్ మూడేళ్ళు ఉండబోవని కేంద్రం ప్రకటించడం.. ఇంకోవైపు సంవత్సరానికి 25 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఎంపీలాడ్స్ ఓకే పర్పస్‌కు కేటాయించడం వీలు కాని పరిస్థితి.. ఉండగా రేవంత్ రెడ్డి జిమ్మిక్కులు చేస్తూ ఏకంగా 50 లక్షల రూపాయలు ఒకేసారి టిమ్స్‌కు కేటాయించడం ప్రచార ఆర్భాటమే టిఆర్ఎస్ ఆరోపించింది.

టీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిషాంక్ టిమ్స్‌కు విరాళం ఇచ్చిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన 50 లక్షల రూపాయల విరాళం చెల్లదని, ఆయన కేవలం పబ్లిసిటీ కోసమే విరాళం ప్రకటించారని ఆరోపించారు. మరోవైపు రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైడ్రో క్లోరోక్విన్ తయారీ అంశంపై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కామెంట్ చేశారు.

తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైడ్రో క్లోరోక్విన్ ఉత్పత్తి గత రెండు దశాబ్దాలుగా మనదేశంలో కొనసాగుతుందని, ఈ విషయం తెలియని రేవంత్ రెడ్డి ఐఐసీటీలో పనిచేసే కేటీఆర్ బామ్మర్దికి కాంట్రాక్ట్ ఇచ్చారంటూ పిచ్చి కూతలు కూస్తున్నారని ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ‘‘కేటీఆర్ ఆయన బామ్మర్ది విషయం ఏమైనా ఉండొచ్చు.. కానీ దానితో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు’’ అని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు

Latest Articles
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా? సీఎం రేవంత్ వ్యూహం ఇదే
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
బంగారం కొనుగోలు చేస్తున్నారా..?కొనుగోలు సమయంలో ఈ జాగ్రత్తలు మస్ట్
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. నోటి క్యాన్సర్ ఉన్నట్లే!
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
గూగుల్ సరికొత్త ఆవిష్కరణ
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
పెద్ద “గాడిద గుడ్డు”.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార వీడియో వైరల్..
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
రేపటితో ముగుస్తోన్న 'ఇంటర్' సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
నక్క తోక తొక్కావ్ బ్రో.. సలార్‌లో ప్రభాస్ బైక్ గెలుచుకుంది ఇతనే
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డ ఖైదీ.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..