Farmers Protest: రైతుల ట్రాక్టర్‌ ర్యాలీపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు… అంశాన్ని వారికే వదిలేస్తున్నామని..

|

Jan 20, 2021 | 2:12 PM

Police Should Decide On Tractor Rally: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టాలను వెనక్కి తీసుకోకపోతే వచ్చే గణతంత్ర దినోత్సవం..

Farmers Protest: రైతుల ట్రాక్టర్‌ ర్యాలీపై కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు... అంశాన్ని వారికే వదిలేస్తున్నామని..
Follow us on

Police Should Decide On Tractor Rally: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టాలను వెనక్కి తీసుకోకపోతే వచ్చే గణతంత్ర దినోత్సవం (జనవరి26)న ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు.
ఇక ఈ ర్యాలీని అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సుప్రీకోర్టు విచారణ చేపట్టింది. ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతి నిరాకరించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు స్పందిస్తూ.. ర్యాలీకి అనుమతి ఇచ్చే అంశాన్ని ఢిల్లీ పోలీసులకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో ఎటువంటి ఆదేశాల‌ను తాము ఇవ్వ‌ద‌లుచుకోలేద‌ని కోర్టు అభిప్రాయపడింది. తుది నిర్ణయం పోలీసులదేనని తేల్చిచెప్పింది. జనవరి 26న చేపట్టనున్న ట్రాక్టర్‌ ర్యాలీకి అనుమతులు కావాలంటూ రైతులు సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేస్తే.. ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. దీంతో సుప్రీం కోర్టు ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.

Also Read: Girl Deceased Cardiac Arrest: పాపం పసిపాప.. విమానంలోనే ప్రాణాలు వదిలింది.. కారణం ఏంటో తెలుసా..